Saturday, 26 September 2026 04:09:33 AM

సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పదకతకు కృషి చెయ్యాలి...

అర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్..

Date : 10 December 2024 08:22 PM Views : 573

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అర్జీ-1 ఏరియా జిడీకే 11 ఇంక్లైన్ లో మల్టీ డిపార్ట్ మెంటల్ సమావేశం D. లలిత్ కుమార్ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో సంస్థ,మన గని,మన బాధ్యతలను వివరించే మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం మొదటి రెండవ బదిలీలలో నిర్వహించారు. ఈ సందర్బంగా జియం లలిత్ కుమార్ మాట్లాడుతూ... మన సంస్థ, మన గని, మన బాధ్యతలను వివరించే ఇట్టి “మల్టి డిపార్ట్ మెంటల్ సమావేశంలో వివిధ అంశాల గురించి కమిటి సభ్యులు తెలిపారని అన్నారు. సింగరేణి సంస్థ చైర్మెన్&మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ ఐర్స్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల పై మల్టి డిపార్ట్ మెంటల్ సమావేశం నిర్వహించుకోవటం జరుగుతుందని ఇందులో భాగంగా సంస్థ పురోభివృద్ధికి సాధించవలసిన అంశాల గురించి తెలియజేస్తూ మన సంస్థ, మన గని, మన భాధ్యతలను నిర్వహిచడం జరిగిందన్నారు. తద్వార తమ వంతుగా ప్రతి ఒక్కరు వివిధ సలహాలు ఇవ్వడం సంస్థపై అంకితభావం, సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పదకతలు పెంచుటకు సంస్థను ముందుకు తిసుకుపోదాం అనే నినాదంతో కంపెని వ్యాప్తంగా ఇట్టి సమావేశాలను నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. మల్టి డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలోని గనులు వాటి పని తీరు గురించి వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఉత్పత్తి ఉత్పాదకత, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తరలింపు, నెలల వారిగా నిర్థెశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా సాదించుటకు ప్రణాళికల గురించి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆర్.జి 1 ఏరియాకు నిర్థెశించిన ఉత్పత్తి పెంపునకు తీసుకోవలసిన ప్రణాళికల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జియం గోపాల్ సింగ్, ఎఐటియుసి బ్రాంచి సెక్రటరీ అరెల్లి పోషం, ఏరియా ఇంజనీర్ డి.వి రావు, ఐఇడి ఎజియం ఆంజనేయులు, ఏజంట్ చిలుక శ్రీనివాస్, డిజీయం పర్సనల్ కిరణ్ బాబు, ఫైనాన్స్ డిజియం ధనలక్ష్మి భాయి, మేనేజర్ కోలా మల్లేశం, కమిటి సభ్యులు రాజన్న, నాయిని శంకర్, మహేష్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :