Saturday, 26 September 2026 03:43:43 AM

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన బిజేపి శ్రేణులు...!

Date : 11 April 2025 06:42 PM Views : 467

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వారం రోజుల పాటు రామగుండం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను బిజేపి పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగా ఈరోజు గోదావరిఖని జీయం కాలనీ, రామ్ నగర్ లో జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి హాజరై అంగన్వాడి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం సపోషణ్ అభియాన్, పోషణ్ tracker యాప్, ఇ-ఆంగన్వాడి మాడ్యూల్ వంటి పథకాల ద్వారా అంగన్వాడి సేవలలో పారదర్శకత,సమర్థతను పెంచుతోంది అన్నారు. పిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల పోషణ,శిశు సంరక్షణకు అంగన్వాడి కేంద్రాలు కీలకం” అని పేర్కొన్నారు. అంగన్వాడి టీచర్లతో, కార్యకర్తలతో ఆమె మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఫండ్లు, పోషకాహార కిట్లు, డిజిటల్ మానిటరింగ్ వంటి అంశాలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో బండారి శ్యాం ,మచ్చ విశ్వాస్, అంకరీ భరత్, రాధండీ శ్రీనాథ్, గుండెబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :