ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మంచిర్యాల నుంచి గోదావరిఖని వస్తున్న ఆటో, గంగా బ్రిడ్జి పై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసుల సమాచారం మేరకు, వేగంగా వస్తున్న ఆటో బ్రిడ్జి పై నిలిచిన లారీని గమనించలేక బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న స్వప్న మరియు అజీమ్ అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Admin
Aakanksha News