Monday, 10 August 2026 03:06:35 PM

రాములు స్థూపాన్ని తొలగించడం కార్మికుల, ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి...

రాములన్న స్థూపాన్ని కూల కొట్టడాన్ని నిరసిస్తూ ధర్నా...సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న

Date : 18 December 2024 06:28 PM Views : 572

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గత నాలుగు రోజుల క్రితం రామగుండం మున్సిపల్ అధికారులు మెడికల్ కాలేజ్ రోడ్డు వెడల్పులో భాగంగా అమరుడు ఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు యు. రాములు స్మారక స్థూపాన్ని తొలగించడం కార్మికుల, ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. దీనికి నిరసనగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ, ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమిషనర్ కు మెమోరండంను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ.. కార్మిక నాయకుడు విప్లవ ట్రేడ్ యూనియన్ IFTU రాష్ట్ర కార్యదర్శి యు రాములు మార్చి.14-2004. సంవత్సరములో హత్య చేయబడ్డాడని, అతని జ్ఞాపకార్థం స్మారక చిహ్నంగా గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ప్రజలు, కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలతో స్తూపాన్ని నిర్మాణం చేసుకొని, గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా మార్చి 14వ. తేదీన కార్మికులు ప్రజలు తమ నాయకుడి సేవలు కొనియాడుతూ నివాళులు అర్పిస్తూ వర్ధంతి సభను జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ స్మారక స్థూపాన్ని గోదావరిఖని మెడికల్ కాలేజ్ రోడ్డు వెడల్పు కోసం మున్సిపల్ అధికారులు అతి ఉత్సాహంతో ఎలాంటి సమాచారం లేకుండా తెల్లవారుజామున స్థూపాన్ని కూల్చడాన్ని సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ, ఐ ఎఫ్ టీ యు తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.మేము కానీ మా పార్టీ, యూనియన్ కానీ అభివృద్ధికి, విస్తరణకు, వ్యతిరేకం కాదని అన్నారు. కార్మికుల తమ ప్రియతమ నాయకుడుగా యు రాములు స్థూపాన్ని విస్తరణలో భాగంగానే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న స్తూపంకు కొంత దూరం జరిపి కట్టడం, లేదా అంబేద్కర్ భవన నిర్మాణ స్థలం పక్కన కానీ అర్జీ-1 జీఎం కార్యాలయం ప్రక్కన కానీ బస్సు డిపో పక్కన ఎక్కడైనా ఒకచోట స్థలం కేటాయించి స్తూప నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ, ఐ ఎఫ్ టీ యూ నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్ ,చిలుక శంకర్, కొల్లూరి మల్లేష్, మెరుగు చంద్రయ్య, ఎం దుర్గయ్య, ఆర్ రాయమల్లు, సమ్మెట తిరుపతి, ఎం కుమార్, అజయ్, వి మల్లేష్, శ్రీనివాస్ ,ఎం కొమరయ్య, జి వెంకన్న, రాజ కొమురయ్య, ఐ సాంబయ్య,కుమార్, సమ్మయ్య, సదానందం, సతీష్.లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :