Sunday, 27 September 2026 07:06:04 AM

అక్రమ కూల్చివేతలపై న్యూఇండియా పార్టీ ఫైర్...బాధితులకు నష్టపరిహారం చెల్లించండి...

లేకపోతే ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరిక....

Date : 25 June 2025 06:20 AM Views : 875

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమ కూల్చివేతలపై న్యూఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల తీవ్రంగా స్పందించారు. మార్కండేయ కాలనీలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “పేదల ఇళ్లను, మానవ జీవనాధారాలైన షాపులు, స్థలాలను అడ్డగోలు విధ్వంసం చేస్తున్నారు. ఇది అభివృద్ధి పేరుతో నడిచే పుణ్య కార్యక్రమం కాదు. ప్రజల న్యాయహక్కులను తుంచేయడమే,” అని విమర్శించారు.అశోక్ వేముల ఆరోపించిన అంశాల ప్రకారం, ఇటీవల నగరంలోని ఓల్డ్ అశోక్ టాకీస్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్, బస్టాండ్, చౌరస్తా, ఎన్‌టీపీసీ గ్రీన్‌బెల్ట్, మల్కాపురం ఎస్‌టిపి, కళ్యాణ్ నగర్, రాజేష్ థియేటర్ పరిసరాలు, న్యూ ఇండియా షాపులు తదితర ప్రాంతాల్లో పేద ప్రజల ఆశ్రయాలను, వ్యాపార స్థలాలను అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. ఒక్క పక్క అధికారులు ప్రజాపక్ష నాయకుల ఒత్తిడికి లొంగి ఇళ్లను కూల్చగా, మరొక పక్క అదే నేతలు మళ్లీ అనధికార అనుమతులతో అక్రమ కట్టడాలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలా ‘అభివృద్ధి’ పేరుతో ఒకవైపు శవాలపై ప్యాలాలు ఏరుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు,” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.అశోక్ వేముల డిమాండ్ చేస్తూ చెప్పారు – “ప్రతి బాధిత కుటుంబానికి తక్షణమే ఇల్లు లేకపోతే కనీసం రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. రీహాబిటేషన్, రీ సెటిల్మెంట్ లేవు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజలు చైతన్యహీనులు కారు. ఈ ధ్వంసానికి పాల్పడిన అధికారులూ, పాలకులూ త్వరలోనే ప్రజా తీర్పును ఎదుర్కొంటారు.అంతేగాక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తుచిత్తుగా ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయపరమైన సమరానికి, పోరాట కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ ఆరోపణల నేపథ్యంలో రామగుండం మున్సిపల్ పాలక వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధికారుల స్పందనపై తక్షణమే రాజకీయ మరియు సామాజిక వర్గాలు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :