Saturday, 26 September 2026 05:31:33 AM

సర్కిల్ సాబ్ పై వకీల్ సాబ్ లా తిరుగుబాటు..

క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదు... న్యాయవాదుల డిమాండ్

Date : 27 February 2025 11:59 AM Views : 974

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వివాదాలకు నిలయంగా మారుతుంది. సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యవహారిస్తున్న తీరు పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సర్కిల్ సాబ్ కు వ్యతిరేకంగా వకీల్ సాబ్ లు గోదావరిఖనిలో నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... భార్ అసోసియేషన్ సభ్యులు జూనియర్ న్యాయవాది నాంతబాద్ కిరణ్ జీ ఈనెల 19వ తేదీన ఓ మైనర్ బాలుడు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన సందర్భంలో సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో పాటు గెట్ అవుట్ అంటూ చిందులు వేయడంతో జరిగిన విషయాన్ని బార్ అసోసియేషన్ లో న్యాయవాది కిరణ్ జీ తెలపడంతో రెండు రోజుల క్రితం పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, మంథని కోర్టులలో న్యాయవాదులు విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే దురుసుగా ప్రవర్తించిన సీఐ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తన ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. గతంలో కూడా ఇలాగే ప్రవర్తించి కేసుల పాలైన సంగతి కూడా గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా సీఐ ఇంద్రసేనారెడ్డి తన పద్ధతి మార్చుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :