Saturday, 26 September 2026 05:02:13 AM

రజతోత్సవ సభను విజయవంతం చేయండి....

Date : 15 April 2025 06:30 PM Views : 454

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : ఈ నెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలో మల్హర్, మహాముత్తారం, మహదేవ్ పూర్, పలిమెల మండలాల బీర్ఎస్ నాయకులతో నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభ సన్నాహక సమావేశం దిశ నిర్దేశం చేసి బహిరంగ సభ గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గా పుట్టి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు ఎప్రిల్ 27 న నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు విజయవంతం చేయాలన్నారు. మంథని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండా ను ఆవిష్కరించాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :