Friday, 26 June 2026 12:17:18 AM

ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి....

Date : 23 September 2024 06:27 PM Views : 330

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. సోమవారం సిపిఎం మంథని శాఖ మహాసభ మంథని విద్యార్థి యువత కార్యాలయంలో నిర్వహించాగా శాఖ కార్యదర్శి బూడిద గణేష్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. సామాన్య ప్రజలు, కార్మికులు, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని గతంలో కౌలు రైతులకు రుణాల కోసం కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు నెలలు తరబడి జీతాలు అందక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక అనేక అవస్థలు పడుతున్నారని, ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించి పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ల సందీప్ ,ఏల్పుల సురేష్, రవి, గొరింకల సురేష్, మౌర్య, సమ్మయ్యలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :