ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : భారీ ప్రచారాలు,హంగులు ఆర్భాటాలతో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ వీధికొక్కటి చొప్పున పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను అదుపు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరిఖని పారిశ్రమిక ప్రాంతంలో వెలిసిన కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులను వసూలు చేస్తూ చలిచాలని స్థలం, ఇరుకైన గదులు కనీస సౌకర్యాలు లేని పాఠశాలలో కార్పొరేట్ పేరుతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఇరుకు ఇరుకు గదులలో అధిక మొత్తంలో విద్యార్థులను తరగతి గదిలో కూర్చోబెట్టి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నడుస్తున్న ఓ కార్పొరేట్ పాఠశాల తీరు నిదర్శనం అని చేపవచ్చు. పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కార్పొరేట్ పాఠశాల ప్రీ ప్రైమరీ అనుమతులు ముగిసి దాదాపు సంవత్సరమవుతున్న ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు పొందకుండానే పాఠశాలను నిర్వహించడం దీనిని విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు ఉండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సదురు పాఠశాల ప్రైమరీ అనుమతుల గురించి సంప్రదిస్తే అనుమతులు కావాలని దరఖాస్తు చేసుకున్నామని డీడీ తీశామని తమ ఫైల్ పెండింగ్లో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏలా నడిపిస్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కనీసం ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటారా..? లేక ఇలాగే చూసి చూడనట్లు వ్యవహరిస్తారా...? అనేది వేచి చూడాల్సిందే...
Admin
Aakanksha News