Monday, 10 August 2026 05:35:54 PM

ఓదెలలో ఏపీఎం మెండి లతా మంగేశ్వరికి ఘన సన్మానం...

Date : 31 July 2025 07:38 PM Views : 596

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా (ఏపీఎం) పనిచేస్తున్న మెండి లతా మంగేశ్వరి కి ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు. 2017 సంవత్సరంలో ఓదెల ఏపీఎంగా బాధ్యతలు చేపట్టిన లతా మంగేశ్వరి, పదేండ్లకు పైగా సమర్థవంతంగా సేవలందించిన అనంతరం బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి వెళ్లనున్నారు.ఈ సందర్భంగా ఓదెల మండలంలోని గ్రామ సమైక్యల అధ్యక్షులు, గ్రామ సంఘం అసిస్టెంట్లు, సిబ్బంది ఆమెను శాలువాలతో సన్మానించి, సేవల్ని గుర్తించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర, రాము, సీసీలు మారెళ్ల శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయరాజకుమారి, స్త్రీనిధి మేనేజర్ ప్రభాకర్, పవన్, భవాని, రమేష్, రాము, మండల సమైక్య పాలకవర్గ సభ్యులు ఆలేటి స్వప్న రెడ్డి, పి. అనూష, జె. అనూష, వివో అధ్యక్షురాలు, వివోఏలు పాల్గొన్నారు. సేవలో నిబద్ధతను చాటిన లతా మంగేశ్వరి బదిలీపై వెళ్లడంపై మండల ప్రజలు అభినందనలు తెలిపి, కొత్త నియోజకవర్గంలో ఆమెకు మరింత గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :