ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా సమీపంలోని స్పూర్తి భవన్ లో శనివారం ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇరువురికి కళారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ ఫేట్ డి లా మ్యూజిక్ అని పిలువబడే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారన్నారు. 1982లో ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మొదటిసారిగా ఈ వేడుకలను నిర్వహించారన్నారు. అప్పటినుండి 108 దేశాలలో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. దాసరి రామస్వామి, బొత్త భూమయ్యకు గోదావరి కళారత్న పురస్కారాలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీనివాస్, పలు సంస్థల కళాకారులు రేణికుంట రాజమౌళి, మేజిక్ రాజా, కాసిపాక రాజమౌళి, సోగాల వెంకటి, ఎల్వీ రావు, పి.చంద్రపాల్, అట్ల జగ్గయ్య, టి.అంజిబాబు, కొత్వాల్ రాజయ్య, జూల మోహన్, బీరుక లక్ష్మణ్, ధన్ సింగ్ తదితరులు పాల్గొనగా.. నాగుల శ్రీనివాస్, రాంబాబు, రాణి, పరమాత్మ, రామస్వామి, బీమాచారి, అంజలి, మాధవి, నూకల మొండి, ఎజ్జ రాజయ్య, రాజేశ్వరరావు గీతాలు ఆలపించారు.
Admin
Aakanksha News