Friday, 26 June 2026 01:20:50 AM

నల్ల బంగారానికి నడక నేర్పేది ఎవరు...? సింగరేణి బొగ్గుతో లక్షల రూపాయల వ్యాపారం...

ప్రతి రోజు టన్నుల కొద్దీ సింగరేణి బొగ్గు అక్రమ రవాణా... బొగ్గు దందాలో నాడు తండ్రి.... నేడు తనయుడు...

Date : 05 March 2025 10:42 AM Views : 1487

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ మనుగడ కోసం కృషి చేస్తుంటే అక్రమార్కులు మాత్రం సింగరేణి బొగ్గును అక్రమంగా తరలిస్తూ సంస్థ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టాన్ని సమకూరుస్తున్నారు. ఈ బహిరంగ దందా వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా ఎల్కలపల్లి గెట్, లక్ష్మిపురం వద్ద ఉన్న రైల్వే లైన్ నుండి ప్రతి రోజు ఎన్టీపీసీకి బొగ్గు రవాణా జరుగుతుంది. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కొందరు నడుస్తున్న రైలు నుండి బొగ్గును కిందికి జారవేసిన అనంతరం వాహనాల ద్వారా అక్రమంగా అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా బొగ్గు రవాణా చేస్తూన్నారు. అయితే బహిరంగంగా ఇంత జరుగుతున్న స్థానిక అధికారులకు కనిపించడం లేదా...? కనిపించిన మామూళ్ల మత్తులో అక్రమార్కులను పట్టించుకోవడం లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం జనసంచారం. చీమ చిటుక్కు మన్న సమాచారం అందే చోట ఇంత బహిరంగంగా నడుస్తున్న రైలు నుండి బొగ్గు తీస్తూన్నా చూసి చూడనట్లు వ్యవహరించడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.దీనిలో పెద్ద ఎత్తున కొంత మందికి లక్షల రూపాయలు చేతులు మరుతున్నాయనే ప్రచారం సాగుతోంది... గతంలోకూడా ఇలాగే బొగ్గు దందా నిర్వహించిన సందర్భాల్లో అక్రమార్కులపై పీడీ యాక్ట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి.. అయితే ఈ బొగ్గు దందాలో తమకు ఉన్న పలుకుబడితో కొంత మంది చక్రం తిప్పుతున్నారనే ప్రచారం స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. ఈ బొగ్గు దందాపై సింగరేణి యాజమాన్యం ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

బొగ్గు దందాలో నాడు తండ్రి.... నేడు తనయుడు...

ఎల్కలపల్లి, లక్ష్మిపురం కేంద్రంగా సాగుతున్న అక్రమ బొగ్గు రవాణాలో నాడు తండ్రి కీలకంగా ఉంటె నేడు తనయుడు కీలకంగా మారాడు. గత కోనేళ్ళుగా సింగరేణి బొగ్గును వారసత్వ ఆస్తిలా దోచుకుంటున్న అక్రమార్కులపై ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సింగరేణి బొగ్గును అక్రమంగా తరలిస్తూ సింగరేణి ఆదాయానికి నష్టం కలిగిస్తూ ఎన్టీపీసీకి రవాణా అయ్యే బొగ్గును దోచుకుంటున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :