ఆకాంక్ష న్యూస్ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గౌతమ్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం రేకుర్తి కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు వంద మంది పాల్గొనగా వారికి షుగర్, బిపి టెస్టులను చేసి నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న 20 మందికి కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రికి ఆపరేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మగువ ప్రెసిడెంట్ సునీత, బీనా, తిరుమల,సత్గుణ, స్వరూప,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News