Friday, 26 June 2026 01:21:37 AM

నిర్బంధం నీడలో ప్రజాభిప్రాయ సేకరణ సరికాదు.... జూపాక శ్రీనివాస్

ప్రభావిత ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి...

Date : 28 January 2025 04:38 PM Views : 495

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : నిర్బంధం నీడలో ప్రజాభిప్రాయ సేకరణ సరికాదని, ప్రభావిత ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని CPI ML మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ...ఎన్టీపీసీ సంస్థ ఏర్పాటులో ఇప్పటికే కుందనపల్లి, మల్యాలపల్లి, రాజాపురం, మాతంగి కాలనీ, కాజిపల్లి,మొగల్ హాడ్, మేడిపల్లి, బుచ్చయ్యపల్లి, కృష్ణానగర్, మల్కాపురం, ఎల్కలపల్లి, వీర్లపల్లి, లక్ష్మీపురం న్యూ పోరట్ పల్లి, గ్రామాల ప్రజలకు నేటికీ వరకు పూర్తిస్థాయి నష్టపరిహారం లేక తమ కుటుంబాలను చిద్రం చేయడం జరిగిందన్నారు. శాస్త్రీయ పునరావాసం కల్పించాల్సిన ఎన్టీపీసీ యాజమాన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. ఎన్టీపీసీ యాజమాన్యం తప్పుడు నివేదికలు ప్రజాభిప్రాయ సేకరణ ప్రదర్శించి క్లియరెన్స్ టి ఓ ఆర్ తెచ్చుకున్నారని . మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎన్టీపీసీ రామగుండం విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను చట్టం తెలియని అమాయకులుగా భావించి తాము రాసినవే గొప్పవి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఏర్పాటులో భూములు ఇచ్చిన వారికి నేటికీ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోగా మళ్లీ భూసేకరణ పేరుతో ముందుకు వస్తూ నిర్బంధం నీడలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ ఇక్కడి ప్రాంత ప్రజల పోరాటాన్ని తక్కువగా చూపే ప్రయత్నం ఎన్టీపీసీ యాజమాన్యం కొనసాగించడం తీవ్ర ఆక్షేపనీయం అభ్యంతరకరం అని తెలిపారు.ఈ విధానాన్ని రామగుండం పారిశ్రామిక ప్రజలంతా తీవ్రంగా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.ఎన్టీపీసీ ఏర్పాటులో భూ నిర్వాసితులైన వారికి ఇచ్చిన హామీలను మొదటగా అమలు జరిపిన తర్వాత విస్తరణ కోసం భూసేకరణ జరపాలని డిమాండ్ చేసారు. పోలీసు పహారా మధ్య ప్రజలను స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను చెప్పుకునే వీలు లేకుండా నిర్బంధాన్ని ఉపయోగించి తమ అనుకూల శక్తులచే అనుకూల మాటలు మాట్లాడించుకొని సంబరపడి ఇక్కడి ప్రజలను ఇక్కడ యువతను గాలికి వదిలేసే చర్యలను విడనాడాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్య వాతావరణం మధ్య తమ అభిప్రాయాలు చెప్పుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.నేడు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా నిర్బంధం నీడలో జరిగినందున దానిని రద్దుచేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎన్టీపీసీ ఏర్పాటు సందర్భంగా 25 వేల కుటుంబాలు కారు చౌకలో తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ భూ ఉపాధిని త్యాగం చేసిన రైతులకు యువతకు భూసేకరణలో భూమి కోల్పోయిన కారణంగా 15 పట్టుమని 100 ఉద్యోగాలు కూడా ఇవ్వని ఎన్టీపీసీ యాజమాన్యం నేడు మరొక్కసారి ప్రజలను మళ్లీ మోసగించేందుకు ముందుకు వస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్టీపీసీ యాజమాన్యం చేస్తున్న కుటిల ప్రయత్నాలను త్రిప్పి కొట్టాలని ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో CPI ML మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు తోకల రమేష్ గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, ఆడెపు శంకర్, గూడూరి వైకుంఠం, కలవల రాయమల్లు తూల్ల శంకర్, ఇనుగాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :