ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి సంస్థ తన కార్మిక సంక్షేమమే ముఖ్యమని ఎన్నో సార్లు ప్రకటించినా, ఆ మాటలు కార్యరూపం దాల్చిన తీరు కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కార్మికుడికి జరిగిన అన్యాయం సంస్థ ధర్మాన్ని ప్రశ్నించించేలా మారింది. కార్మికుడికి తెలియకుండానే అతను నివసిస్తున్న సింగరేణి క్వాటర్‌ను మరొకరికి కేటాయించడమే కాకుండా, ఆ క్వాటర్‌లో ఉన్న అతని సామాగ్రిని ఎవరో తరలించటం కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళితే...సింగరేణిలో పని చేస్తున్న ఓ కార్మికుడు గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ క్వాటర్‌లో ఉంటూ సేవలందిస్తున్నారు. అయితే ఇటీవల అతనికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆ క్వాటర్‌ను మరో సింగరేణికి సంబంధంలేని ప్రైవేటు వ్యక్తికి కేటాయించారు. దీనితో సరిపోకుండా, ఆ క్వాటర్‌లో వున్న కార్మికుడి గృహోపయోగ సామాన్లు, అతని వ్యక్తిగత వస్తువులు మాయమయ్యాయి. ఇంతకీ ఎవరు తరలించారు... ? ఎక్కడ పెట్టారు..? అనే విషయాలపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. దీంతో ఈ ఘటన కార్మికుడి కుటుంబాన్ని కలిచి వేసిన చర్య ఈ ఘటనతో కార్మికుడి కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. తమ దైనందిన అవసరాల వస్తువులు కనపడకుండా పోవడం,ఇల్లు వదిలించేందుకు ముందు ఎలాంటి సమాచారం లేకపోవడం వారిని ఖంగుతినేలా చేసింది. ఈ చర్యపై వారు కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
అధికారుల ధోరణిపై ప్రశ్నలు....
సింగరేణిలో నిత్యం నెరపే క్వాటర్ కేటాయింపు ప్రక్రియలో ఇలా కార్మికులకే సమాచారం లేకుండా చర్యలు తీసుకోవడం, సంస్థలో పారదర్శకతపై అనేక అనుమానాలు నెలకొనే విధంగా ఉంది.కార్మికుడికి తెలియకుండా అతని ఇంటి సామాన్లను ఎవరూ తాకే హక్కు ఉండదని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. దీనికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇంకా అనుతరంగా మిగిలిపోయింది. అయితే దీనిపై సింగరేణి సీఅండ్‌ఎండీ స్పందిస్తారా...?ఈ ఘటనపై సింగరేణి సీఅండ్‌ఎండీ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కార్మికుల పట్ల అన్యాయం జరుగుతుంటే పైస్థాయిలో ఉన్న అధికారులు స్పందించకపోతే, ఆ సంస్థలో నైతిక విలువలకు ఉన్న స్థాయేంటనే చర్చ మొదలైంది. పైగా కంపెనీ గోడలపై వేలాడే నైతిక బోధనల వాక్యాలు కేవలం ప్రదర్శనకే పరిమితమా అన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై అవసరమైన విచారణ, చర్యలు ఎప్పుడూ..? సామాగ్రిని ఎవరు తరలించారు.. ? ఆదేశాలు ఎవరిచ్చారు..? ఇప్పుడు ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయి...? అనే ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై విచారణ జరిపి, తగిన విధంగా శాఖా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.సింగరేణి కార్మికులే ఈ సంస్థకు వెన్నెముక. వారిపైనే ఇలా వ్యవహరించడం అసహనాన్ని రేపుతోంది. మేము సంస్థను ఆందోళనతో హెచ్చరించేందుకు సిద్ధం" అంటూ కొందరు కార్మికులు హెచ్చరిస్తున్నారు.
నైతిక విధ్యలు పాటించాలి...
ఒకవేళ ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేక కావాలనే కార్మికుడిని చిన్నచూపు చూసి జరిగినదా? అనే కోణంలో సంస్థలో సమగ్ర విచారణ జరగాలి. బాధితుడికి నష్ట పరిహారం ఇవ్వడం తో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. ఈ ఘటనపై ప్రజలలోనూ, కార్మిక వర్గాలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “సంక్షేమమే లక్ష్యమని చెప్పే సింగరేణికి, కార్మికుల బాధలు పట్టవా?” అని నోరు తెరిచే పరిస్థితి ఏర్పడింది. సంస్థ పట్ల నమ్మకం కోల్పోతున్న కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే, తక్షణమే ఈ విషయంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Aakanksha News