Sunday, 27 September 2026 07:40:51 AM

45 మందికి ఉచిత కంటి వైద్య శస్త్ర చికిత్సలు...

Date : 09 April 2025 03:23 PM Views : 322

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 11వ డివిజన్ లో ఉచిత కంటి శాస్త్ర చికిత్సలను నిర్వహించారు. హైదరాబాద్ నాన్నక్రాంగూడ లోని సంకర కంటి హాస్పిటల్ కు 45 మందిని ఆపరేషన్ నిమిత్తం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ నాయకులు లంక సురేష్ మాట్లాడుతూ..ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి పేద ప్రజలకు సేవ చేయాలని ఆపదలో ఉన్నవారికి అండగా నిలువకోవాలని సూచించారన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే ఫౌండేషన్ లక్ష్యం అని వారు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లడం జరిగుతుందని తెలిపారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో 11డివిజన్ లో ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేపడుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ CEO తిట్ల రమేష్ బాబు, కీర్తి నాగార్జున, ఎల్.నరేష్ D.సుకుమార్. ఏల్ వెంకటేష్, B. కిరణ్, G. సదానందం, రాజకుమార్, పేషెంట్లు రూపమ్మ, లక్ష్మి, మొండయ్య,గడ్డం లక్ష్మి, ఆలయ ఫౌండేషన్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్, బస్తీ వాసులు, పెద్దలు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :