Friday, 26 June 2026 01:24:33 AM

లోన్ పేరిట రికవరీ ఏజెంట్ల వేధింపులు....

ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తూ హల్ చల్...

Date : 03 January 2025 12:19 PM Views : 1026

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి గనులకు నీలయమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫైనాన్స్ కోరలు చస్తుంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని గ్రూప్ లోన్స్ పేరుతో మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు కోకోల్లొలుగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే లోన్ యాప్ లు, ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఈ మధ్య కాలంలో ఈ లోన్స్ గోదావరిఖనిలో కొందరు రికవరీ ఎంజెట్లు ఇష్టార్యాజంగా వ్యవహరించి వారిని అనేక రాకలుగా మానసికంగా వేధింపులకు గురి చేయడమే కాకా ఇంట్లో ఉన్న వారి కుమారుడిని రికవరీ ఏజెంట్లు తమ వెంట తీసుకవెళ్లినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండే ఓ ప్రైవేట్ బ్యాంకు మొదటగా మార్కండేయ కాలనీలోని కొంత మంది మహిళల వద్దకు వచ్చిన రికవరీ ఎంజెంట్లు, మార్కెటింగ్ ఎక్స్క్యూటివ్ లు తమ ఫైనాన్స్ కంపెనీ ఒక్క గ్రూప్ ను ఏర్పాటు చేసుకుంటే అందరికి కలిపి లోన్ ఇస్తామని వారికీ ఆశ చూపించి తీరా లోన్ ఇచ్చే సమయానికి కమిషన్ పేరు మీద ఇచ్చిన లోన్ నుండి సుమారుగా ౩ నుండి 5 వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. అలాగే ప్రతి నెల లోన్ డబ్బులు తీసుకవెళ్లడానికి వచ్చిన సమయంలో కొందరు రికవరీ ఏజెంట్లు సమయానికి డబ్బులు ఇవ్వడం లేదని మా ఇంట్లోకి వచ్చి తమ సెల్ ఫోన్ లో మా ఫోటోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి ఆగడాలు భరించలేక పోతున్నామని కొంత మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజు రోజుకు పెరిగిపోతున్న ఓ ప్రైవేట్ బ్యాంకు బాధితులు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదా నగర్ లో వెలసిన ఓ ప్రైవేట్ బ్యాంకు బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.వారి వేధింపులు భరించలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. లోన్ పేరుతో తమ ఇంట్లోకి వచ్చి అనేక రాకలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఎటువంటి అనుమతులు లేకుండా బ్యాంకును ఏర్పాటు చేసారంటూ పిర్యాదు చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి.

మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న రికవరీ ఏజెంట్లు :

పెద్దపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది రికవరీ ఏజెంట్లు లోన్ డబ్బులు కట్టాలని లేకపోతే ఊరుకునేది లేదని ఇంట్లోకి వచ్చి మహిళల ఫోటోలు తీయడంతో పాటు పక్కనే ఉన్న వారికి లోన్ డబ్బులు కట్టడం లేదని పక్కన ఉన్న అందరికి చెప్పుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పెద్దపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ ఇబ్బందులు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :