Saturday, 26 September 2026 04:32:14 AM

అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి...

వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు...

Date : 25 March 2025 08:09 PM Views : 438

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఇటీవల కురిసిన అకాల వర్షానికి పెద్దపల్లి మండలంలో రైతులు వారి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయారని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్ కు బిజెపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. వడగండ్ల వర్షం వల్ల వీళ్ళ ఎకరాల మొక్కజొన్న గాలివానకు పూర్తిగా దెబ్బతింది అన్నారు అలాగే కష్టపడి పండించిన రైతులకు వరి పూర్తిగా నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల చొప్పున ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బిజెపి మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్, టౌన్ అధ్యక్షులు పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్, రాజేశ్వరరావు, తిరుపతి,ఎర్రోళ్ల శ్రీకాంత్. ముంజ రాజేంద్రప్రసాద్. మ్మల్లయ్య. గాధాసి సతీష్. కుక్క అంజి మధు. శివయ్య తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :