Tuesday, 11 August 2026 05:55:43 PM

రామగుండంలో ఔరంగజేబు పాలన సాగుతోంది... పోచమ్మని కొట్టినోడు కొసెల్లడు...!!

❇️ హిందూ మనోభావాలు దెబ్బతీసినోళ్లు భస్మం అయితారు...బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి...

Date : 07 November 2025 08:44 PM Views : 599

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పోచమ్మని కొట్టినోడు కొసెల్లడు అని గ్రామదేవతలు అయిన మైసమ్మ, వేలుపమ్మ, పోచమ్మ గుళ్లు కూల్చివేసిన నేపథ్యంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంఘటనకు సంబంధించిన కారకులను తీవ్ర స్థాయిలో శపించారు రామగుండం బిజెపి మహిళా నేత కందుల సంధ్యారాణి. ఈ మేరకు శుక్రవారం కూల్చిన ఆలయాలను వారు సందర్శించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గ్రామదేవతల గుళ్లను కూల్చిన మూర్ఖులంతా మట్టి కొట్టుకుపోతారు అని అన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీసినోళ్లు భస్మం అయితారు అని తెలిపారు. రామగుండంలో ఔరంగజేబు పాలన సాగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘటనకు ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా గ్రామదేవతల గుళ్లను కూల్చడం పిచ్చి తుగ్లక్ పని అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య,జక్కన బాలు,బూడిద హర్ష,బండారి శ్యాం కుమార్,శిలారపు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :