ఆకాంక్ష న్యూస్ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని : రామగుండంలో అభివృద్ధి పేరుతో అంతా కూల్చివేతల పర్వం కొనసాగుతుందని, సంక్రాంతి పండుగ తర్వాత నుంచి పాలనపై తిరుగుబాటు మొదలవుతుందని మాజీ శాసన సభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ హెచ్చరించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తెలంగాణ బోకు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తుందని అభివృద్ధి జపంతో కుల్చివేతలు సాగుతున్నాయని అన్నారు.చిరు వ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణల కూల్చివేతలు చేయడంతో వారు రోడ్డున పడే పరిస్థితిలు నెలకొన్నాయని తెలిపారు.రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి సుందరీకరణ పేరుతో ఎన్టీపీసీ గోదావరిఖనిలో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చి వేస్తూ వారి జీవితాలను రోడ్డుమీదకు తీసుకువచ్చరని వారు దినదిన గండంగా బతికే పరిస్థితి నేడు నెలకోందన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామిలను నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే దాట వేస్తున్నరని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని స్దానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మహాలక్ష్మి పథకం కింద మహిళలు నెలకు రూ. 2500 వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతులకు రైతు భరోసా కింద 15 వేల రూపాయల పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైయ్యాయో స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ ఎన్నో హామీలు ఇచ్చి గెలిచి ఇప్పుడు సంవత్సర కాలం గడుస్తున్న ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గత పూర్వ వైభవాన్ని తెస్తా అని స్దానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నడని గత వైభవం అంటే ఈ ప్రాంతం ఒక గ్రామపంచాయతి... ఒక నోట్ ఫైడ్ ఏరియా.. ఒక మున్సిపల్ ప్రాంతం అని అన్నారు. ఓసిపి 5 బాస్టింగ్ లతో పరిసర ప్రాంతాల నివాసాలు పూర్తిగా దెబ్బతీంటున్నాయన్నాయని వాటిపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాలన్నారు. సింగరేణి క్వాటర్స్ కు మౌళిక వసతుల కల్పించడం కోసం మాట్లాడాలన్నారు. దుకాణాలను కుల్చడం కాదని ఉన్న ఇళ్లను క్వాటర్లను కపాడాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామిలను నెరవెర్చాలని స్దానిక ఎమ్మెల్యే ను డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో రామగుండం కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణ వేని నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు నారాయణదాసు మారుతి బోడ్డు రవీందర్ నూతి తిరుపతి సట్టు శ్రీనివాస్ జక్కుల తిరుపతి ఇరుగురాళ్ల శ్రావన్ శేషగిరి వెంకన్న ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యా రెడ్డి రాజేష్ ఆతరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News