ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా జరుగుతున్న ఈ బంద్‌కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కూడా పూర్తి మద్దతు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ — “బీసీలకు న్యాయం చేయగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి” అని అన్నారు.
Admin
Aakanksha News