ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు లేని విధంగా కార్మికులకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సింగరేణి సంస్థ నూతన సర్క్యులర్ ను విడుదల చేసింది. ఇందులో బొగ్గు గని సాదించిన ఉత్పత్తి శాతాన్ని బట్టి ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీని వాళ్ళ కార్మికులకు కొంత వరకు మేలు జరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే కాలానికి అనుగుణంగా సింగరేణి సంస్థ కూడా పలు మార్పులను తీసుకవస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల 100 %శాతం నుండి 104 %శాతం శాతం ఉత్పత్తి సాధించిన గని యూజీ క్యాట్-1 కు చెందిన కార్మికులకు రూ.1500, క్యాట్-2 కు చెందిన కార్మికులకు రూ.1200, అలాగే 105 %శాతం నుండి 109 %శాతం సాధిస్తే ఓసి మైన్స్ క్యాట్-1 కు చెందిన కార్మికులకు రూ.2000, అలాగే క్యాట్-2 కార్మికులకు రూ.1700, అలాగే సీహెచ్ పీ, సీఎస్పీలలో 110 %శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి సాధిస్తే క్యాట్-౧ కార్మికులకు రూ.2500, క్యాట్-2 కార్మికులకు రూ.2200,లు ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ లో పేర్కొంది. దీనిపట్ల రానున్న రోజుల్లో కార్మికులు ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే..
Admin
Aakanksha News