Sunday, 29 March 2026 04:36:12 PM

రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిపై దాడి...

వీడియో సాక్ష్యాలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు.... వికలాంగుడినని తెలిసినా దాడి చేశారని గుండు రాజు ఆవేదన...

Date : 11 February 2026 09:37 PM Views : 486

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిపై జరిగిన దాడి కలకలం రేపుతోంది.రామగుండం రమేష్‌నగర్‌కు చెందిన గుండు రాజు కార్పొరేటర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.గుండు రాజు తెలిపిన వివరాల ప్రకారం, పోలింగ్ బూత్‌గా ఏర్పాటు చేసిన గ్రాండ్ ఆల్డ్రైవింగ్ స్కూల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్‌.పి. రాజేశ్వర్ సమక్షంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానంతో తాను ప్రశ్నించగా, ప్రత్యర్థి అభ్యర్థి పాతపల్లి ఎల్లయ్య మరియు అతని అనుచరులు ఆగ్రహానికి గురై తనపై మరియు తన అనుచరులపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదుల పేర్కొన్నారు.ఈ సందర్భంగా అక్కడున్న మహిళలపై కూడా దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించారని ఆయన తెలిపారు.అదే ఘటనతో మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పటికీ అక్కడ కూడా తనకు అనుచిత అనుభవం ఎదురైందని గుండు రాజు తెలిపారు. తాను వికలాంగుడినని తెలిసినా విచక్షణా రహితంగా తనపై దాడి చేశారని, లింగాల హరికృష్ణ, గోపాల్, లింగాల రవి తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారని ఆరోపించారు. దాడి సమయంలో వందకు పైగా మంది తనపై దాడి చేశారని పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు మరియు ఇతర సాక్ష్యాలను ఎన్నికల అధికారులకు సమర్పించనున్నట్లు గుండు రాజు వెల్లడించారు. తనపై మరియు మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపిస్తున్న ఆర్‌.పి. రాజేశ్వర్‌ను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఘటనపై అధికారిక ఫిర్యాదు నమోదు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఎన్నికల అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :