Sunday, 27 September 2026 06:10:02 AM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లను కార్మికుల గుర్తించడం లేదు...

77 ఏళ్ల తర్వాత కూడా దేశంలో కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేదు... ఐఎఫ్ టీ యూ నాయకులు వెంకన్న

Date : 20 April 2025 02:29 PM Views : 407

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లను కనీసం కార్మికులుగా కూడా గుర్తించడం లేదని ఐఎఫ్ టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆర్జీ 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-1 వద్ద మేడే పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... 77 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేదన్నారు. పర్మనెంట్ కార్మికులకు బదులుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు అమలులో ఉన్న పాలకవర్గం పార్టీలు కార్మిక హక్కులపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే కార్మిక వర్గం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాటిని ఎంతైనా వెనక్కి తిప్పి కొట్టాల్సిన అవసరం మనందరిపై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగయ్య, శ్రీనివాస్, రాజమౌళి,హైమాద్, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :