Sunday, 27 September 2026 06:13:25 AM

TBGKS ప్రధాన ద్వారం గేట్ కూల్చివేత...

Date : 27 December 2024 09:30 AM Views : 878

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయం ప్రధాన గేటును సింగరేణి అధికారులు కూల్చివేశారు. రోడ్డు వెడల్పులో తొలగించారని పేర్కొంటున్నారు. అయితే ఇటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రధాన ద్వారం గేటును కూల్చివేయడంపై టీబీజీకేఎస్ అర్జీ-1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, కేంద్ర నాయకులు చెల్పురి సతీష్ లు గేటు ముందు బైఠాయించడంతో వారిని అరెస్టు చేశారు. ఇప్పటికే రోడ్డు వెడల్పులో భాగంగా పలు షాపులను గతంలో అధికారులు తొలగించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :