ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు,సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది అని డ్రగ్స్ కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి అని పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా సే నో టూ డ్రగ్స్ అనే నినాదం తో ఓదెల మోడల్ స్కూల్, హై స్కూల్, కస్తూర్బా విద్యార్థులతో కలిసి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఓదెల సెంటర్లో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు మరియు ప్రతిజ్ఞ చేయించినారు.పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని చుట్టూ జరుగుతున్న అనైతిక కార్యకలాపాల గురించి వారిలో అవగాహన పెంచాలి అని డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రభావం ఇప్పుడు పల్లెప్రాంతాలకూ విస్తరించిందనీ,వీటి నుంచి యువతను కాపాడుకోవాలి అని తెలిపారు.గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణాకు సులభ మార్గాలనీ, విద్యార్థులు,యువత వీటికి బలవుతున్నారనీ,మత్తులో ఉన్న వ్యక్తి తన చర్యల్ని గుర్తించలేని స్థితికి చేరతాడనీ,ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నేరపూరిత జీవితానికి దారితీస్తుందని అన్నారు. అంతేకాకుండా సరదా కోసం అయినా డ్రగ్స్ వైపు అడుగు వేయకండనీ,ఇవి కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాన్నీ నాశనం చేస్తాయని తెలిపారు. డ్రగ్స్‌కి బలైపోకుండా మీ భవిష్యత్తును కాపాడుకోనీ విజేతలుగా ఎదగండి అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల విద్యాధికారి రమేష్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News