Friday, 26 June 2026 01:24:27 AM

ఉషోదయంలో విద్యార్థిని చితకబాదిన టీచర్..

పాఠశాలలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ...

Date : 25 November 2024 06:05 PM Views : 2074

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖనిలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న కారణాలతో విద్యార్థులను చితకబాదుతూ విద్యాసంస్థలు విభాగాలకు నీలయంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖనిలోని ఉషోదయ పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయుడు విద్యార్థిడిని కొట్టడంతో సదురు విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఇదేంటి అని అడగడానికి వచ్చిన తల్లిదండ్రులతో తులసిగా సమాధానం చెబుతూ దూషిస్తున్నారని విద్యాశాఖ అధికారులకు పీడీఎస్ యూ విద్యార్థి విభాగం నాయకులు ఈర్ల రామచందర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థిడిని చితకబాదిన ఘటనపై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీఓ) కు ఫిర్యాదు చేశారు.

కార్పొరేట్ పాఠశాలలోనూ విద్యార్థిడిని చితకబాదిన వైనం...?

మార్కండేయకాలనీలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో సైతం విద్యార్థిడిని చితకబాదినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే పాఠశాలలో పాఠాలు బోధించే అధ్యాపకుడు విద్యార్థి చేయిపై ఇష్టారాజ్యంగా కొట్టడంతో గాయాలు కాగా వెంటనే గమనించిన సదురు ఉపాధ్యాయుడిని పాఠశాలలో మందలించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి సదరు కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం రాయబారం నడిపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే పాఠశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :