ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని ప్రస్తుతం కరువుకు కేరఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ అసమర్ధత పాలన సాగుతుందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం మాజీ శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మాజీ ఎమ్మెల్యే గోదావరినదిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు గోదావరినది నిండు కుండలగా జల కల సంతరించుకుంటే నేడు కాంగ్రెస్ పాలనలో గోదావరినదిలో నీళ్లు లేక వెలవెలబోతుందని అన్నారు.కేసీఆర్ ఎంతో గోప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరినదిని నిండుకుండలాగా మార్చరన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హాయంలో తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గోదావరినదిపై తెప్పాల పోటీలు నిర్వహించామని చెప్పారు. మహశివరాత్రి పర్వదినం నాడు భక్తులు గోదావరినది స్నానం అచరించడం అనవాయుతిగా వస్తుందని కాని స్నానాలు చేసేందుకు సరైనా నీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్దత పాలనకు నిదర్శనం అని విమర్శించారు. అబద్ధాలతో అమలు కాని హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ రామరాజు ఉన్నారు.
Reporter
Aakanksha News