Friday, 26 June 2026 01:14:48 AM

కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే పోలీసులతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు....

రామగుండంలో జాఫర్ జమానా మళ్ళీ మొదలైంది... బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్...

Date : 02 May 2025 11:54 AM Views : 992

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రభుత్వ అధికారులపైనే అధికార పార్టీ నాయకులతో పోలీస్ కే కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే కేసులు పెడతామని బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులతో కలసి వేధిస్తున్నారని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామగుండంలో మళ్లీ జాఫర్ జమానా మొదలవుతుందని ఆనాడే చెప్పమన్నారు. రామగుండం పాలనపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పట్టు కోల్పోతున్నారని, ప్రజా పాలన గాడి తప్పుతుందని విమర్శించారు. 16 నెలలుగా ప్రతిపక్షాల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. జిల్లా వైద్య అధికారులు తనిఖీలకు వచ్చే ముందు వారితో మాట్లాడాల్సి ఉండేదని అన్నారు. ప్రభుత్వ అధికారులపై అధికార పార్టీ నాయకులతో పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్గం తహసిల్దార్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘటన మరువక ముందే మళ్లీ కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి జిల్లా వైద్యాధికారులపై పోలీస్ కేసులు పెట్టించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో గాదం విజయ, కృష్ణవేణి సంధ్యారెడ్డి.అభిషేక్ రావు నారాయణదాసు మారుతీ, మురళీధర్ రావు, నీరటీ శ్రీనివాస్, నూతి తిరుపతి, తిమోతి, రత్నాకర్, కిరణ్ జీ తో పాటు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :