Tuesday, 11 August 2026 02:41:50 PM

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భార్యపై భర్త దాడి...

హోంగార్డు గట్టయ్యపై హత్యాయత్నం కేసు నమోదు..

Date : 22 February 2025 07:35 AM Views : 1073

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తన అక్రమ సంబంధాన్ని నిలదీసిందనే అక్కసుతో భార్యపై విచక్షణ రహితంగా భర్త దాడి చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రామగుండం కమిషరేట్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గట్టయ్య వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఇంట్లో సాధారణమైన ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసే వాడని ఇదే విషయంపై ఎన్నో సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగిన తనలో ఎటువంటి మార్పు రాలేదని ఇదేంటి అని అడిగినందుకు భార్య రామలక్ష్మిని నిత్యం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండటంతో ఈ విషయంపై భార్య గట్టయ్య ను నిలదీసింది. ఇది మనసులో పెట్టుకొని భార్య రామలక్ష్మిపై తీవ్ర స్థాయిలో దాడి చేసి గాయపరిచాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రామలక్ష్మి సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు గట్టయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఒక్కటవ పట్టణ అదనపు సీఐ రవీందర్ తెలిపారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :