ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : సుందరకాశ్మీరంలోని పెహల్గాములో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన దాడి భారత ఆత్మపై జరిగిన దాడిగా దేశప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించడం ఆయనకు దేశప్రజలపై ఉన్న శ్రద్ధను తెలియపరుస్తోందని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల మాజీ ఎమ్మెల్యే తిరంగాయాత్ర జిల్లా కన్వీనరు కాశీపేట లింగయ్యతో కలిసి మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడి అనంతరం 140కోట్ల మంది భారతీయులు ఒక్కటై సైనికుల వెంట నిలవడటం గర్వంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజలప్రాణాలను తీయాలని చూస్తున్న శత్రుదేశం పాకిస్తానుకు మన సైనికులు తగిన గుణపాఠ చెప్పారని ప్రశంసించారు. మరోమారు దేశంవైపు కన్నెత్తి చూస్తే ప్రపంచపటం నుండి పాకిస్తాన్ మాయమైపోవడం ఖాయమన్నారు. అవసరమైతే దేశరక్షణకోసం ప్రతీ ఒక్కరు ఒక సైనికులమవుతాం అని ఆయన స్పష్టం చేశారు.
23న పెద్దపల్లిలో తిరంగాయాత్ర....
దేశసమగ్ర రక్షణ భారతప్రధాని నరేంద్రమోదీ సంకల్పమని అందుకోసం అహర్ణిషలు ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని గుజ్జుల పేర్కొన్నారు. పాకిస్తానుపై అఖండ విజయం సొంతం చేసుకున్న భారత సైనికుల వెంట ఉన్నమనే సంకేతాన్ని అందించేలా దేశవ్యాప్తంగా తిరంగాయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 23న పెద్దపల్లి జిల్లాకేంద్రంలో భారీ తిరంగాయాత్ర నిర్వహించనున్నట్లు వివరించారు. పార్టీలకు అతీతంగా, అన్ని సంఘాలు తిరంగాయాత్రలో పాలుపంచుకోని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తిరంగాయాత్ర కోకన్వీనరు వెళ్ళంపల్లి శ్రీనివాసరావు, నాయకులు ఠాకూర్ రాంసింగ్, పల్లె సదానందం, పర్ష సమ్మయ్య, జంగ చక్రధర్ రెడ్డి, బెజ్జంకి దిలీప్ కుమార్, కడారి అశోక్ రావు, శిలివేరు ఓదెలు, భూషనవేన శ్రీనివాస్ గౌడ్, శివంగారి సతీష్, చాతరాజు రమేష్, తూడి రవీందర్, బొంకూరి చిరంజీవి, ఎండి ఫహీం, కంకణాల జ్యోతిబసు, మిట్టపల్లి వెంకటేషం, మేరుగు రవీందర్, బండ కరుణాకర్, భూషనవేని వేణు గౌడ్, కొమ్ము తిరుపతి, యెల్లంకి రాజేందర్, జనార్ధన్ రెడ్డి, శనిగరం రమేష్, గర్రెపల్లి నార్యాణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News