Monday, 10 August 2026 04:06:25 PM

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి....

నూతన కానిస్టేబుల్ లకు దిశానిర్దేశం...రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్...

Date : 30 November 2024 03:22 PM Views : 623

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేయ్యాలని, పోలీసింగ్‌ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐజీ సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుండి పోలీస్ శాఖకు ఎంపికైన 392 మంది ఇందులో 236 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 83 మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు, 156 మంది ఆర్ముడ్ కానిస్టేబుళ్లు,37 మంది ఆర్ముడ్ మహిళా కానిస్టేబుళ్లు, వివిద పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్ళి 9 నెలల పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని కమీషనరేట్ కు రావడం జరిగిందని అన్నారు. కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు. పోలీసు శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిన ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని, అధికారులు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పోలీసులకు ప్రధాన బాధ్యత ప్రజల రక్షణ అని, వారి హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలని చెప్పారు. పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని, అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని అంకిత భావంతో సేవలుందిస్తూ వృత్తి పరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు ఉన్నదని, చట్టబద్ధమైన పౌరులుగా మీ సేవలను చూసి సమాజం గౌరవించేలా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ ,నిబద్దతతో పనిచేసి పోలీస్ వ్యవస్థకు కృషి చేయాలని, కమీషనరేట్ కు, తెలంగాణ పోలీస్ కు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎ ఆర్ ఏసీపీ సుందర్ రావు, ఎఓ అశోక్ కుమార్, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, శ్రీనివాస్, సూపరిండెంట్ల ఇంద్ర సేనా రెడ్డి, మనోజ్ కుమార్,సంధ్య, ఇన్స్పెక్టర్ లు, ఆర్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :