Tuesday, 11 August 2026 08:08:12 PM

ఘనంగా అమరవీరుల దినోత్సవం...

Date : 30 January 2025 05:19 PM Views : 463

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం ఏరియా అర్జీ-1 జీఎం కార్యలయంలో భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అద్యక్షతన ఉద్యోగులతో మౌనం పాటించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇదే రోజున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమం అన్ని గనులు, కార్యాలయంలో కుడా నిర్వహించడం జరిగినదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి సాయి ప్రసాద్ ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరి అరెల్లి పోషం, సి.ఎం.ఓ.ఐ ఇంచార్జ్ క్రాంతి, జియం ఆఫీస్ ఇంచార్జ్ రాజు, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, ఎన్విరాన్ మెంట్ డిజియం ఆంజనేయ ప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ బంగారు సారంగపాణి, శ్రావణ్ కుమార్, హన్మంతరావు, బీమా, వసంత్ కుమార్, వీరారెడ్డి, ఉమేష్, అక్బర్ అలీ మరియు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :