Saturday, 26 September 2026 04:41:03 AM

ఎన్నికల ముందు ఏడ్చారు... ఎన్నికలయ్యాక ఏడిపిస్తున్నారు... బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ధ్వజం...

అధికారులు బయపడి పారిపోయే పరిస్థితి రామగుండంలో నెలకొంది...

Date : 19 February 2025 04:32 PM Views : 771

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎన్నికల ముందు ఏడ్చి... ఎన్నికలు అయ్యాక గెలిచి... ప్రజలను ఏడిపిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ... రామగుండంలో అధికారులు విధులు నిర్వహించాలంటే బయపడి పారిపోయే పరిస్థితి నెలకొంటుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎటువంటి ప్రణాళిక కానీ, డిపిఆర్ కానీ లేకుండా కేవలం కూల్చివేతలు మాత్రమే సాగిస్తున్నారని, వ్యాపారులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. రామగుండం నియోజక వర్గంలో ఉన్న ౫౦ డివిజన్ లలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదన్నారు. గతంలో అనేక హామీలు ఇచ్చి గెలిచారని ఒక్కటి కూడా అమలు చేయడం లేదని తెలిపారు. నియోజక వర్గంలో ఇసుక, మట్టి అమ్ముకుంటూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న బూడిదను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రత్యేక్షంగా ఎవరిని పని చేసుకోనివ్వకుండా స్థానిక లారీలకు, స్థానికులను నష్టం చేసుకుంటూ బయటి కాంట్రాక్టార్లతో కుమ్మకై ఎన్టీపీసీని బెదిరింపులకు గురి చేసున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్న కేంద్రం కానీ బండి సంజయ్ కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ భయపడుతున్నాడా... లేక ఆయనకు ఏమైనా వాటా ఉందా అని ప్రశ్నించారు. అలాగే స్థానికంగా ఉన్న లారీలకు, టిప్పర్లకు అవకాశం ఇచ్చి గోదావరిఖని లారీ అసోసియేషన్ నుండే నడిచే విధంగా చిత్తశుద్ధి ఉంటె అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు.ఓట్లకు ముందు ప్రజల దగ్గరికి వెళ్లి ఏడ్చి గెలిచిన తర్వాత ప్రజలందరిని ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు, అభివృద్ధి అంటే కూల్చివేతలేనా అని ఆయన అన్నారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను తుంగలో తొక్కిందని రాష్ట్రంలో హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి కూల్చివేస్తుంటే రామగుండంలో అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేయకుండా కేవలం కూల్చివేతలే చేపడుతూ వ్యాపారస్తులను ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది గుర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఎన్టీపీసీలో ఉద్యోగాల దందాను చేస్తుంటే కేంద్రం కానీ, అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :