ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న ఓ పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణిగుంట ప్రీతం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సమస్య ఉందని బాధితుల పక్షాన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఓ సీఐ దృష్టికి తీసుకువెళ్తే సదరు అధికారి బాధితుల సమస్యలను పరిష్కరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ నీ సమస్య పరిష్కరించను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో... అని బెదిరింపులకు గురి చేస్తూ అతనిని గెంటివేయండి అని ఇష్టం వచ్చినట్లు సదరు అధికారి మాట్లాడినట్లు ప్రీతం తెలిపారు. ఇప్పటికే ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంటున్న సదురు సిఐని సస్పెండ్ చేయాలని లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శనిగారపు చంద్రశేఖర్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, ధనాల ఉదయ్, సంగే, రాహుల్ తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News