Saturday, 26 September 2026 04:07:52 AM

రిక్షా కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ నుంచి జీతాలు చెల్లించాలి. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన మద్దెల దినేష్.

సీనియార్టీ ప్రకారంగా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమించాలి .

Date : 18 April 2025 05:16 PM Views : 355

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో ర్యాగ్ పిక్కర్స్ కార్మికులుగా 101 రిక్షాలకు చెందిన 202 మంది కార్మికులు ర్యాగ్ పిక్కర్స్ గా 2002 సంవత్సరం నుంచి విధులు నిర్వహిస్తున్నారని వారికి మ్యాచింగ్ గ్రాంట్ నుంచి జీతాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రంను ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ...చెత్త రాహిత్య మున్సిపాలిటిగా తీర్చిదిద్దే వీరు ఇంటింటి ఆతిథ్యాన్ని తీసుకుంటూ మున్సిపల్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పైన అతి తక్కువ వేతనాలతో జీవిస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన రిక్షా, ట్రాలీ / ర్యాగ్ పిక్కర్స్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అన్నారు.వారికి ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వక అనారోగ్యాలకు గురై మంచాన పడిన కార్మికులు ఎందరో ఉన్నారని, ఐనా దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న వారి సమస్యలను తమరి ద్వారా పరిష్కంచాలని, సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలిపిన నేటి వరకు వారి సమస్యలను పరిష్కారం కానందున తమరి దృష్టికి తీసుకవస్తున్నామని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా గతంలో మాదిరిగా అనగా 2004 సం॥రం॥లో మున్సిపల్ అధికారుల నుండి నోడల్ ఆఫీసర్లను నియమించి ర్యాగ్ పిక్కర్స్ కు కార్మికుల యూనియన్ తరుపున నాయకులను, కార్మికులను నెలకు ఒక సారి జరిగే సమావేశాలు ఉండేవని, వారి జీత భత్యాల సమస్య, పని విధానాలపైన, ఆరోగ్య సమస్యలపైన చర్చలు జరిగేవని, సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు. గతంలో ఉన్న విధానాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. అదే విధంగా ర్యాగ్ పిక్కర్స్ కార్మికుల నుండి 70 మంది కార్మికులను సీనియార్టి ప్రకారంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా తీసుకున్నారు. మిగతా 130 మందిని కూడా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా నియమించి వారికి ఉద్యోగ భద్రత కల్పించగలరని, అదే విధంగా వారికి రావలసిన సంక్షేమ పథకాలను ఇప్పించగలరని ఆయన కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :