Saturday, 26 September 2026 04:09:53 AM

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం...

Date : 10 June 2025 12:31 PM Views : 1081

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గత ఆరు రోజుల క్రితం గోదావరిఖని సమీప గోదావరి నది ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను స్థానికులు గుర్తించి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరియు మానసిక స్థితి బాగా లేనందున వైద్యులు చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ప్రాణాలు విడిచింది.ప్రస్తుతం ఆమె మృతదేహన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరచినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదని వెల్లడించారు. మహిళను ఎవరైనా గుర్తిస్తే గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి (ఫోన్: 8712656516) నంబరుకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :