ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని మండలం గుంజపడుగు గ్రామంలో తప్పుడు దృవీకరణ పత్రంతో రిజిస్ట్రేషన్ చేపించుకొని రహదారి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గుంజపడుగు అంబేద్కర్ మాల మహానాడు కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నలమాసు రాజీరు అర గుంట భూమిని కొనుగోలు చేయగా అతని చిన్న కుమారుడు శ్రీనివాస్ తప్పుడు దృవీకరణ పత్రంతో గోదావరిఖని నివాసి తిరుపతికి రెండు గుంటల భూమిని రిజిస్టేషన్ చేపించారన్నారు. వెంకటేశం అనే వ్యక్తి తిరుపతి వద్ద రెండు గుంట భూమిని కొనుగోలు చేశానని తన వద్ద రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నావని దారిని కబ్జా చేస్తూ మల సంఘం జెండా గద్దెను కూల్చివేశారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించినప్పటికి పట్టించుకోలేదని మాల సంఘం నాయకులు వాపోయారు. తప్పుడు దృవీకరణ పత్రంతో రిజిస్ట్రేషన్ చేపించుకొని రహదారిని కబ్జా చేసిన విషయంపై విచారణ చేపట్టాలన్నారు. రెండు గుంటల స్థలం రిజిస్టేషను చేపించుకోవడానికి ఏ ఆధారాలతో ధృవీకరణ పత్రం జారీ చేశారొ పంచాయతి కార్యదర్శి చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ నిధులతో నిర్మించిన అంబేద్కర్ మాల సంఘం భవనానికి వెళ్లే రహదారిని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ మాల మహానాడు కమిటి సభ్యులు లింగయ్య, గట్టయ్య, సంపత్, సుమన్, రవీందర్, నదానందం, తిరుపతిలు ఒక ప్రకటనలో కోరారు.
Admin
Aakanksha News