Saturday, 26 September 2026 05:08:48 AM

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో దారుణ హత్య....

వివాహేతర సంబంధమే హత్య కారణామా...?

Date : 28 April 2025 04:37 PM Views : 1578

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో యువకుడిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సోమవారం దారుణ హత్య చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి మండలం అప్పన్నపేట్ గ్రామానికి చెందిన పోలం కుమార్ ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ ను కత్తితో మెడ పై పొడిచి హత్య చేశాడు. అయితే ఈ ఘటన జరిగే సమయంలో పక్కనే ఓ మహిళ కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు వివరాలు తెలుసుకుంటున్నారు. నిందితుడిని, ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.పెద్దపల్లి డీసీపీ, పెద్దపల్లి సిఐ సుల్తానాబాద్ సీఐ పెద్దపల్లి ఎస్ఐ లు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :