Friday, 26 June 2026 01:16:17 AM

మాట్రిమొని పేరుతో ఘరానా మోసగాళ్ళు...

17 లక్షలు టోకరా ... అమాయక ప్రజలను మోసం చేస్తున్న బార్యాభర్తలు

Date : 03 November 2024 05:54 PM Views : 2443

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని 17 లక్షల రూపాయలు మోసపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రాగా డిజి.షికా గోయల్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశానుసరం వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ DSP యం.వెంకటరమణ, సీఐ జె. కృష్ణమూర్తి కేసు నమోదు చేసి పరిశోదన ప్రారంభించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పై నిందితుల ఇద్దరిని పెద్దపల్లి జిల్లా హరిపురం గ్రామం ముత్తారం మండలంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..ఎర్ర వెంకటనాగరాజు, కారుడ్రవర్, రామంచ సౌజన్య వీరిద్దరూ భార్యాభర్తలు కలిసి తెలుగు మ్యాట్రిమోనీ డాట్ కామ్ అనే వెబ్ సైట్లో వారి సెల్ ఫోన్ నెంబర్ లను అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రోఫైల్ క్రియేట్ చేసి వేరే అందమైన అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేస్తూ అబ్బాయిలకు రిక్వెస్ట్ పెట్టుతూ ఎవరైతే వాటికీ స్పందిస్తారో, వారి దగ్గర నుండి మోసపూరితంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు.వారి యొక్క అమ్మకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో ఉందని హాస్పిటల్ కి ఖర్చులకు డబ్బులు కావాలని మాయమాటలు చెప్పి గత కొంత కాలంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్నా నిందితులిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు.ప్రజలు మ్యాట్రిమోనీ డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో గుర్తు తెలియని వ్యక్తుల నుండి రిక్వెస్ట్ రాగానే వాటికీ స్పందించి సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్ DSP యం.వెంకటరమణ ప్రకటనలో తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :