Monday, 10 August 2026 04:31:54 PM

పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ అందజేత...

Date : 21 January 2025 07:46 PM Views : 581

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్ కాలనీలో నివాసముంటున్న ముగ్గురు వ్యక్తులు పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను మంగళవారం సీఐ ప్రసాద్ రావ్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. కొన్ని నెలల క్రితం ఆకారపు సతీష్ రెడ్డి, పులి అరుణ, టీ రాజులు తమ సెల్ ఫోన్లు పోయాయని సీఈఐఆర్ పోర్టల్ లో కంప్లయింట్ చేయగా...సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముగ్గురి సెల్ ఫోన్ లను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ ట్రేసింగ్ లో కీలక పాత్ర పోషించిన కాల్వ సాయి శివను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :