ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ఉపేక్షించేది లేదని మంథని ఎస్ఐ డి రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత విద్వేషాలు, ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలు అనుమతి లేకుండా ఎవరైనా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే లకు అనుమతి లేదని, డ్రోన్ కెమెరాలను ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవని, నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధo చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
Admin
Aakanksha News