Friday, 26 June 2026 12:17:18 AM

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి....

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం అందజేత...

Date : 16 March 2025 12:01 PM Views : 617

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : సింగరేణి వ్యాప్తంగా 3వ కేటగిరి కోల్ కాంప్లింగ్ మజ్దాూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103 మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 2024 ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై రామగుండం నియోజకవర్గ నాయకులు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డితో కలిసి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.సింగరేణి యాజమాన్యం టెండర్ ద్వారా పొందిన ప్రభుత్వరంగ సంస్థ ఈపీటీఆర్ కంపెనీ నుండి సబ్ కాంట్రాక్టు పొందిన కేసీఎస్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు సంవత్సర కాలంగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈపీటీఆర్ కంపెనీ అధికారులను పలు మార్లు సంప్రదించినా స్పందించక పోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఎంప్లాయర్‌గా వ్యవహరిస్తున్న సింగరేణి అధికారులు కార్మికుల వేతనాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు రూ.15వేల నుంచి రూ.21వేలు వేతనం రావాల్సి ఉండగా కేవలం రూ.3వేలు మాత్రమే చెల్లించారని, మిగిలిన వేతనాన్ని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకుని వెంటనే వేతనాలు చెల్లించేందుకు ఈపీటీఆర్ కంపెనీ, కేసీఎస్ కంపెనీ, సింగరేణి అధికారులు పై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని వారు కోరారు..ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్,కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు...

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :