Friday, 26 June 2026 01:23:50 AM

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం...

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు...

Date : 29 October 2024 02:36 PM Views : 382

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెద్దపల్లి జిల్లా : ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట, దూలికట్ట,జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మరియు వడ్కాపూర్, కాచాపూర్, కుమ్మరికుంట, కోనారావుపేట గ్రామాల్లో మంగళవారం ధాన్యం కోనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. అలాగే రైతన్నలకు పంట పెట్టుబడికి రుణాలు అందించమన్నారు.అలాగే మిగిలిన రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు. సన్న వడ్లు వేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చెప్పి వాటిని కొనుగోలు చేయకుండా మోసం చేశారని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు సన్న వడ్లను కొనుగోలు చేయడమే కాకుండా వాటికి క్వింటాలుకు రూ.5 వందల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. ఏనాడు రైతుల సంక్షేమానికి పాటు పడని, రుణమాఫీ చేయని బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి కొనుగోలు సెంటర్ లోనూ వడ్ల కటింగ్ లేకుండా తాను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కొనుగోల్లు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు ఎంతకాలం తనకు తమ ఆశీర్వాదాలు అందిస్తారో అంతకాలం వడ్ల కటింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు. నిత్యం రైతుల కోసం పనిచేసే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతుల కోసం తాము ఎంత సాధ్యమైతే అంతవరకు పనిచేస్తానని, వారి కళ్ళలో ఆనందం,ముఖాల్లో చిరునవ్వు చూడటం తన జీవిత లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్, దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు,కాంగ్రెస్ పార్టీ ఎలిగేడు మండల అధ్యక్షులు సామా రాజేశ్వర్ రెడ్డి, జూలపల్లి మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ మరియు డైరెక్టర్లు మరియు మాజీ జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు లోక జలపతి రెడ్డి, ధరవేణి నర్సింగ్ యాదవ్, కొమ్ము పోచాలు, హర్షణపెల్లి వెంకటేశ్వర్ రావు, పుల్ల రావు, పర్శరాములు,వామన్ రావు, భూమేష్, సత్తన్న, సంతోష్ రావు,సిరికొండ కొమురయ్య, గొట్టేముక్కలు రవీందర్ రెడ్డి,బండి స్వామి మరియు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు మహిళలు,రైతుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :