Friday, 25 September 2026 04:55:51 AM

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ...

Date : 23 January 2025 02:48 PM Views : 478

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం మండలంలోని ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని శ్రీ చైతన్య హై స్కూల్ లో 6 నుండి 10 తరగతి విద్యార్థులు క్యాట్ లెవెల్-2 పరీక్షల నందు మొత్తం 78 మంది విద్యార్థులు విజయం సాధించారు. ఇందులో 11 మంది విద్యార్థులు 1000 రూపాయల ప్రైజ్ మనీ, 38 విద్యార్థులు మెడల్స్,29 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు గెలుచుకోవడం జరిగిందన్నారు.ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థులను మరియు వారికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ఉపాధ్యాయులను ఏ.జీఎం తిరుపాలు, కో-ఆర్డినేటర్ జయకుమార్, పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ అభినందించారు. ఈ ఫలితాల పట్ల వైస్ ప్రిన్సిపల్ నమ్రత, డీన్ అనిల్ కుమార్, క్యాంపస్ ఇంచార్జ్ నరేంద్ర కుమార్ మరియు అధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :