Sunday, 27 September 2026 05:22:42 AM

రామగుండం పోలీస్ కమిషనరేట్‌ లో ఘనంగా హోలీ సంబరాలు...

Date : 14 March 2025 12:25 PM Views : 521

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంకు చేరుకున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా కి రంగులు పూయడం జరిగింది. ఈ సందర్బంగా సీపీ అధికారులు, సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్‌ వాయిద్యాలతో పోలీస్‌ కమిషనర్‌, అధికారులు, సిబ్బంది, అందరు ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్‌ కమిషనర్‌ స్వీట్లు అందజేసారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లువిరియాలని, ఈహోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు.ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిప్ ఎ,బాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు,గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్ , ట్రాఫిక్ ఎసిపి నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఎసిపి మల్ల రెడ్డి , ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, సిసి హరీష్ , ఎస్‌.ఐ, ఆర్ ఎస్ఐ లు ఇతర పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :