Tuesday, 11 August 2026 08:36:01 PM

నిరుద్యోగ విజయోత్సవ సభలో యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి...

డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్...

Date : 03 December 2024 01:35 PM Views : 463

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుద్యోగ విజయోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభలో వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కమిటీ ఒక ప్రకటనలో చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర రాజదాని హైదరాబాద్, సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తున్న ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అంత వరకు నెలకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తా అని అన్నారని ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు.జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటికీ స్పష్టంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అనేది ఇప్పటి వరకు వివరాలు బహిర్గతం చేయలేదు కాబట్టి వెంటనే ఆ పోస్టుల ఖాళీల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి ఎటువంటి ఉద్యోగ అవకాశాలను కల్పించలేదన్నారు.ఇప్పటికైనా రేపు నిర్వహించే నిరుద్యోగ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని వారికి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చంద్రగిరి కృష్ణ కుమార్, ఉపాధ్యక్షులు గుండబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :