Friday, 25 September 2026 04:18:41 AM

విఠల్ నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం..

సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 98 బైకులు 4 ఆటోలు సీజ్

Date : 24 September 2024 08:11 AM Views : 1345

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాంను నిర్వహించారు. అలాగే అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం సిఐ మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారని ఎవరు ఉంటున్నారు అనేది తనిఖీలు చేసి తెలుసుకోవడం జరిగిందన్నారు. అలాగే ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సోషల్ మీడియా సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించమన్నారు. అలాగే ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని 98 ద్విచక్ర వాహనాలు, 4 నాలుగు ఆటోలను సీజ్ చేశామన్నారు. ఇతనికిల సమయంలో ఆరు లీటర్ల గుడుంబా 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :