Friday, 25 September 2026 04:58:41 AM

సింగరేణి కాపర్ వైర్ అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Date : 11 December 2024 09:30 PM Views : 1156

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికే 2వ ఇంక్లైన్ పరిధిలో సింగరేణికి సంబంధించిన కాపర్ వైర్ ని దొంగిలించి అక్రమంగా హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గోదావరిఖని అడ్డగుంటపల్లి వద్ద అనుమాన స్పదంగా వస్తున్న TS 02 UD 3451 అనే మహేంద్ర ట్రాలీని ఆపి తనిఖీ చేయగా అందులో 65 కిలోల కాపర్ వైర్ ను గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు.దీంతో అడ్డగుంటపల్లికి చెందిన ట్రాలీ డ్రైవర్ దొంతుల శ్రీనివాస్,అందులో ఉన్న ముత్యాల ఐలయ్యను అదుపులోకి తీసుకొని ట్రాలీని,కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ లో అప్పగించడం జరిగిందని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :