ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో పోలీసులపై ఆకతాయిలు దాడులకు దిగి విద్వాంసం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే... జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బ్యాంకు లో కస్టమర్‌కు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పెట్రోల్ బంక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు జరిగిన ఘటనను అడిగి తెలుసుకుంటూ ఉంటె విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బోదుకాని శేఖర్,తమ్మ గంగారాం అనే ఇద్దరు యువకులు ఒక్క సరిగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పంపు తీసి పెట్రోల్ మీద పోస్తానని నానా హంగామా సృష్టించారు. దీంతో హంగామా చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ హల్చల్ చేసిన వారిలో స్థానిక ఓ ఎమ్మెల్యే కు సంబంధించిన వ్యక్తి కావడంతో ఒత్తిడి చేసి విడిపించుకొని వెళ్లినట్లు సమాచారం.
Admin
Aakanksha News